Lava Shark Launched: ఐఫోన్ డిజైన్‌తో లావా కొత్త ఫోన్.. షార్క్ సిరీస్‌తో షేక్ చేస్తోంది.. రూ.6,999లకే..!

Lava Shark Launched: లావా తన భారతీయ అభిమానుల కోసం చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. షార్క్ సిరీస్ కింద ఈ కొత్త మొబైల్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లావా షార్క్ మొబైల్ ఈరోజు అధికారికంగా విడుదలైంది. ఐఫోన్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7000 కంటే తక్కువ. చౌక ధర కారణంగా కంపెనీ పనితీరు, ఫీచర్ల విషయంలో రాజీపడలేదు. రండి ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Lava Shark Features
లావా షార్క్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది హెచ్‌డి ప్లస్ పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 720 x 1612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, మృదువైన గేమింగ్, లాగ్ ఫ్రీ చేస్తుంది. మొబైల్‌లో యూనిసాక్ T606 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది మృదువైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ వర్చువల్ ర్యామ్‌కి సపోర్ట్ ఇస్తుంది.
ఈ లావా మొబైల్‌లో 64GB స్టోరేజ్ ఉంది. మీరు దీన్ని 256జీబీ వరకు పెంచుకోవచ్చు. లావా షార్క్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది. ఇది LED ఫ్లాష్‌తో వస్తుంది. ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది స్క్రీన్ ఫ్లాష్‌తో వస్తుంది. మీరు తక్కువ వెలుతురులో కూడా గొప్ప సెల్ఫీలను క్లిక్ చేయచ్చు. ఫోన్‌లో 5000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు.
Lava Shark Price
సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ , ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫోన్‌ను సురక్షితంగా మరియు త్వరగా అన్‌లాక్ చేయడానికి సహాయపడుతుంది. ఈ లావా షార్క్ ఉచిత సర్వీస్ సౌకర్యంతో వస్తుంది. దీని ద్వారా మీరు ఉత్తమ కస్టమర్ సర్వీస్ పొందచ్చు. లావా షార్క్ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. మీరు కేవలం రూ.6,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయచ్చు. టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది. లావా షార్క్ మొబైల్ లావా రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ఈ నెలలో సేల్‌కి వస్తుంది.