Moto Edge 60 Fusion: మార్కెట్‌లో మంటలే.. మోటో నుంచి ఎడ్జ్ 60 ఫ్యూజన్.. ఏప్రిల్ 2న లాంచ్..!

Moto Edge 60 Fusion: సామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ A26ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.25 వేల కంటే తక్కువ. అదే సమయంలో ఇప్పుడు మోటరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ని పోటీగా తీసుకొస్తుంది. కంపెనీ భారతదేశంలో దాని ప్రసిద్ధ మిడ్ రేంజ్ మోటో ఎడ్జ్ సిరీస్‌లో కొత్త Moto Edge 60 Fusionను విడుదల చేయనుంది. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి అప్‌గ్రేడ్ కానున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2న లాంచ్ కానుంది. కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు లీక్ అయ్యాయి.
Moto Edge 60 Fusion Price
ఫోన్ ఖచ్చితమైన ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, అయితే Moto Edge 60 Fusion ధర దాని మునుపటి మోడల్ వలె రూ. 25,000 కంటే తక్కువగా ఉండవచ్చు. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 22,999 రూపాయలకు విడుదలైంది. ఫోన్ లీకైన రెండర్‌లు బ్లూ, పింక్ , పర్పుల్ మోడల్‌లను కలిగి ఉన్న మూడు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటాయని సూచిస్తున్నాయి.
Moto Edge 60 Fusion Specifications
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మోటరోలా Moto Edge 60 Fusion 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో జత చేసి ఉంటుంది.
అయితే మూడవ కెమెరా గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండచ్చు. ఫోన్ MLT 810 STD మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి, ఇది ఫోన్‌ను సురక్షితంగా ఉంచుతుంది. ఇది కాకుండా IP69 రేటింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు, ఇది నీరు, దుమ్ము రెండింటి నుండి రక్షిస్తుంది.