
December 27, 2025
glowing skin tips in winter: సహజంగా మెరిసే చర్మం అందానికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా సంకేతం అని చర్మ నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సాధారణ స్కిన్ కేర్ పద్ధతులు పాటించాలని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేవగానే ముఖాన్ని మృదువైన క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. రాత్రి నిద్రకు ముందు కూడా ముఖం శుభ్రపరచాలి.. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ధూళి, చెమట, కాలుష్యం వంటివి తొలగిపోతాయి. ఆ తరువాత ముఖానికి తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.






