
January 25, 2026
arasavalli:శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ రోజు రథసప్తమి సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదిత్యుని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉండటంతో కలెక్టర్, పోలీసులు పలు సూచనలు చేశారు. అప్పటికే భక్తుల రద్దీ తగ్గకపోవడంతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.







