Home / UGC
యూనివర్సిటీలు జారీ చేసే ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మరియు డిగ్రీలపై ఆధార్ నంబర్ ముద్రణకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీసీ ప్రకారం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక సర్టిఫికేట్లు మరియు విశ్వవిద్యాలయాలు మంజూరు చేసిన డిగ్రీలపై విశ్వవిద్యాలయ విద్యార్థుల మొత్తం ఆధార్ సంఖ్యను వ్రాయడాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.
చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు మరికొంత మంది అధ్యయనకారులు డాక్టరేట్ తీసుకోవడానికి ఉత్సాహం కనపరుస్తుంటారు. కొంత మంది రెగ్యులర్ బేసిస్ లో పీహెచ్ డీ చేస్తుంటే మరికొంత ఆన్ లైన్ విధానంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంటుంటారు. కాగా ఈ నేపథ్యంలో యూజీసీ ఓ కీలక ప్రకటన వెలువరించింది. ఆ ఆన్ లైన్ పీహెచ్ డీలకు ఎటువంటి గుర్తింపు లేదంటూ ఉత్తర్వుల ద్వారా పేర్కొనింది.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్లను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG)తో విలీనం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ ) దీనికి సంబంధించినిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది.