Home / Telangana Liberation Day
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేత కార్మికులను ఆదుకునేందుకు మక్తల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు.
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరులకు ముందుగా వందనం చేశారు. రజాకార్లపై పోరాడి అమరులయిన వారికి నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.
తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా,రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు.
ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు