Home / Shashi Tharoor
22 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎఐసిసి అధ్యక్షుడిని నిర్ణయించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు సిద్ధమయ్యారు.
ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరోవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగే ఏఐసీసీ ఎన్నికల పైనే అందరిదృష్టీ ఉంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు.