Home / Sharad Pawar
రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ వంశ పారంపర్య రాజకీయాల కారణంగా శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారని, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ముంబైలో తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అజిత్ పవార్ వర్గం, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (బిజెపి) ఎన్‌సిపిని అవినీతిమయం అన్నారు. మరి ఇప్పుడు ఎన్సీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే రిపీటయిందని శరద్ పవార్ అన్నారు.
శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్‌లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన దత్తాత్రేయ గాడ్గే అనే రైతు తన తోటలో మామిడి పండ్లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ పేరు పెట్టారు. గాడ్గే యొక్క తోటలో పండించిన 'శారద్ మామిడి' ఒక్కొక్కటి 2.5 కిలోల బరువు ఉంటుంది . షోలాపూర్‌లో ఏటా నిర్వహించబడే మామిడి పండుగలో ఇవి జనాలను ఆకర్షిస్తున్నాయి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు
అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో ఏడాదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగబోతున్న నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.