Home / Rains
Nigeria: నైజీరియాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా ఇప్పటివరకు 111 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా నైజీరియాను గత సెప్టెంబర్ లో కూడా వరదలు ముంచెత్తాయి. అప్పుడు కూడా ఆనకట్టలు తెగిపోవడంతో 30 మంది […]
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్- దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, […]
Telangana: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిన్నటితో రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. కాగా సోమవారం రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు 2 రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు యాక్టీవ్ గా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. […]
Low Pressure in Bay of Bengal Heavy Rains to Andhra Pradesh: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కాగా అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ.. రేపటి వరకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా బలపడి వాయుగుండంగానూ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇక అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో […]
Rains alert to Andhra Pradesh and Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించగా.. నేడు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. అయితే ఓ వైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం, బంగాళాఖాతంలోని అల్పపీడనం నైరుతి రుతుపవనాల కదలికలకు అనుకూలంగా మారింది. కాగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి మరో రెండు రోజుల్లో ఏపీ అంతటా విస్తరించనున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అలాగే […]
Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుమలు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కుంభవృష్టి పడుతోంది. కాగా శనివారం అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయం వరకు భారీ వర్షం పడింది. కేవలం 6 గంటల్లోనే ఢిల్లీ అంతటా దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా సఫ్దర్ గంజ్ లో 8.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుసాలో 7.1, పాలెంలో 6.81, మయూర్ విహార్ లో 4.8 సెం.మీ. చొప్పున వర్షం పడింది. […]
Monsoon Waves Enters into Kerala: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. ప్రతి ఏటా జూన్ 1 తర్వాత వచ్చే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణశాఖ తెలిపింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు రెడీ […]
2 Dyas Heavy Rains in Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు మద్య అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనం, అలాగే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని పలు […]
Srisailam Reservoir: తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలో ద్రోణి, అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఆయా జిల్లల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద రాక ప్రారంభమైంది. ఇక కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా […]
7 Dead due to Heavy Rains in New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వడగళ్ల వాన కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోయి, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రధానమైన ఢిల్లీ- నోయిడా, ఢిల్లీ- ఘజియాబాద్, ఢిల్లీ- గురుగ్రామ్ హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. […]