Home / PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు ప్రధాని ఆహ్వానం లభిచిందింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.