Home / latest Telangana news
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.
బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదని కెటిఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు.
కరీంనగర్లో ఓ కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజులుగా కరీంనగర్ రెండో డిపోలో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. దీనితో దీనిని వేలం వేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో.. రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లోనే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫారమ్ సైడ్ వాల్‌ను ఈ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్‌పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
ఐదు గ్యారంటీల కోసం అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్‌పై బైక్‌పై నుంచి ఫామ్స్ చిందరవందరగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపాడు. సుమారుగా 500 వరకు ఉన్న ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.