Home / latest crime news
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.
ప్రాణాలకు కాపాడాల్సిన ఈ వైద్యుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలిస్తే ఆక్రోషం వస్తుంది. సోషల్ మీడియా స్నేహాలు ఎంత దారుణాలకు ఒడిగడతాయో చెప్పేందుకు ఈ ఘటన ఓక ప్రత్యక్ష ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది.
దసరా సెలవులు ఆ ఇళ్లల్లో విషాదాన్ని నింపాయి. సరదాగా విహారయాత్రకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది.
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కట్ చెయ్యాల్సింది పోయి చిన్నారి చిటికెన వేలుని కత్తించారు ఆ నిర్లక్ష్యపు వైద్యులు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
టెక్నాలజీ పరంగా ఎంతగా ఎదిగినా మనిషి మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నాడు. శివుడి ఆజ్ఞ అంటూ ఓ చిన్నారిని ఇద్దరు దుర్మార్గులు బలితీసుకున్నారు. ఈ అమానవీయ దారుణ ఘటన ఢిల్లీలోని లోధిలో చోటుచేసుకుంది.