Home / KTR Comments:
భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు.
గత కాంగ్రెస్ హయాంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ రంగాన్ని 2014 తర్వాత పునరుద్ధరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మోటార్లు కాలిపోయాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అలవిగానీ హామీలు ఇచ్చారని, ఇద్దరినీ తాము ఎందుకు వదిలి పెడతామని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!మూడోసారి మనదే జయం..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీల సమస్య అన్నారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. గురువారంజరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వ దళిత బంధు పథకం దళితులను ఆర్థిక స్వావలంబనతో పాటు పారిశ్రామికవేత్తలుగా మారుస్తోందన్నారు.