Home / Komatireddy Venkat Reddy
Jagga Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఆయన కలిశారు. బాధ్యతలు తీసుకున్న కారణంతో మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణ అమలు […]
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి […]
తెలంగాణ కాంగ్రెస్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంధం తెగిపోయిందా? ఆయనను పట్టించుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావించిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.
నవంబర్ 1న సీల్ట్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చిన్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారంనాడు షోకాజ్ నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.
మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేటాయిస్తూ జీవో 246 తెచ్చిందన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.