Home / Kenya
కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.
కెన్యాలోని షకహోలా అడవిలో డూమ్స్‌డే కల్ట్‌లో ప్రాణాలతో బయటపడినవారు మరియు బాధితుల కోసం జరిగిన శోధనలో శనివారం మరో 22 మృతదేహాలను కనుగొన్నారని ప్రాంతీయ ప్రభుత్వ అధికారి తెలిపారు. వీటితో మరణాల సంఖ్య 201కి చేరింది.
ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్మిన క్రైస్తవ మతానికి చెందిన వారిగా భావిస్తున్న 51మంది మృతదేహాలను కెన్యా పోలీసులు వెలికితీశారు.తీర ప్రాంత పట్టణం మలిండి సమీపంలో పోలీసులు శుక్రవారం షాకహోలా అటవీప్రాంతం నుండి మృతదేహాలను వెలికి తీయడం ప్రారంభించారు