Home / International News
పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్ ఇచ్చింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కారు బాంబు దాడి జరిగిందంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిన్నట్లు జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది
అమెరికాలో హరికేన్ ‘కే’ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హరికేన్ అనంతరం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో వాటర్‌వాల్స్‌కు ఇవి దారి తీశాయి.
కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చమురు ధరలు పెరగడం పై ప్రజా స్పందనను వెల్లడించినందుకు ఇక్కడి అల్ రోయా పత్రిక సంపాదకులు, విలేకరుల ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఏకంగా పత్రిక ప్రింట్ ఎడిషన్ శాశ్వతంగా మూతబడిపోయింది.
బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపగా, దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
సౌదీకి చెందిన ఒక వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం మరియు మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని చెబుతున్నాడు.
కింగ్ చార్లెస్ III బ్రిటీష్ కిరీటాన్ని అలంకరించినప్పటి నుండి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ప్రజలు అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారు. అతను తన అల్పాహారంలో తినడానికి ఇష్టపడేవాటి నుండి రాజు తన ఖాళీ సమయంలో చేసే పనుల వరకు ఇందులో ఉన్నాయి.
ఈ సృష్టిలో అంతుచిక్కని అద్భుతాలెన్నో ఉన్నాయి. కాగా అలాంటి వాటికోవకే చెందుతుంది ఈ డెత్ వ్యాలీ. సాధారణంగా ఎవరైనా చలనం లేకుండా ఉంటే ఏంటి రాయిలా కదలకుండా ఉన్నావ్ అంటారు. కానీ అది తప్పు అంటాను నేను ఎందుకంటే ఈ డెత్ వ్యాలీలో రాళ్లు స్వయంగా కదులుతాయి, ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ప్రయాణిస్తాయి.
క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూసిన తరువాత ఆమెకు సంబంధించి పలు విశేషాలు బయటకు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన లేఖ. బ్రిటన్ రాణి రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.