Home / Indigo Flight
ముంబై-గౌహతి ఇండిగో విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గౌహతిలో పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
దుబాయ్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం వాష్‌రూమ్‌లో పొగ తాగాడన్న ఆరోపణలపై శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు సువం శుక్లా వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడ పొగ తాగడం ప్రారంభించాడని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.
సోమవారం నాడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే నుండి బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో విమానాన్ని నిలిపివేసారు. కాల్ వచ్చినప్పుడు విమానం ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి రన్‌వేపై సిద్దంగా ఉంది.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్‌కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
దుబాయ్‌కి వెళ్లే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టడంతో 160 మందికి పైగా ప్రయాణికులను దించాల్సి వచ్చింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏ)లో గురువారం ఉదయం 8.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన ఎంతో సంచలనం రేపిందో అందరికీ తెలుసు.
టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ఘోర సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్ మిస్ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్ మిస్ అయిందని, అక్కడి సిబ్బంది దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కో సారి విమానంలో ఏర్పడే టెక్నికల్ సమస్యల వల్ల లేదా మరే ఏ ఇతర కారణాల వల్ల అయిన కొన్ని సార్లు ఎయిరోప్లెయిన్ లలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి నిన్నరాత్రి డిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో ఈ మంటలు చెలరేగాయి.