Home / gannavaram
Vallabhaneni Vamshi Followers arrested: టీడీపీ కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేత కాసనేని రంగబాబుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ప్రధాన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ముగ్గురు ఓలుపల్లి మోహనరంగాతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరమని వల్లభనేని వంశీ అన్నారు.
Chandrababu: వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.