Home / Europe
యూరప్ లో విపరీతమైన వేడి కారణంగా గత ఏడాది 70,000 మరణాలు సంభవించాయని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) శాస్త్రవేత్తలు వేడి-సంబంధిత మరణాలను కొలిచే ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు చేసిన తర్వాత వారి మునుపటి అంచనా 61,000ని సవరించారు.
ఈ ఏడాది యూరప్‌లో జూన్ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
యూరప్‌లో మరోమారు కరోనా -19 పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెంన్షన్ కంట్రోల్ తమ పౌరులను హెచ్చరించింది.
యునైటెడ్ కింగ్ డమ్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూకేకు లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ వాసులు ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాలను తగ్గించుకుంచుకోవడం గమనార్షం.
ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.
ఆఫ్రికా దేశాలు కరువుతో విలవిల్లాడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు యూరప్కూడా ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని విల్లవిల్లాడిపోతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా యూరప్‌ను ఈ ఏడాది కరువు వెంటాడుతోంది.