Home / Congress
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
బీజేపీ మాదిరి కాంగ్రెస్‌కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సామ్ పిట్రోడాతో తలనొప్పులు తగ్గేట్లు లేవు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ఇటీవలే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వపన్నును అమల్లోకి తెస్తామని ప్రకటించి పెద్ద దుమారం రేపారు. దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంది.
దేశంలోని వైస్‌చాన్సలర్లు, విద్యావేత్తలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై భగ్గుమంటున్నారు. ఆయనకు బహిరంగంగా లేఖ కూడా రాశారు. దీనికంతటికి కారణం దేశంలోని వీసీ అపాయింట్ మెంట్లు కేవలం ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగిన వారికి మాత్రమే దక్కుతున్నాయని రాహుల్ ట్విట్ చేశారు.
ఒడిషాలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పూరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా మొహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశానికి సంబంధించిన సమాచారం టెర్రరిస్టులకు ఇచ్చి విధ్వంసం సృష్టించేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌కు విడదీయరాని సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి ప్రార్థనలు చేస్తోందన్నారు .
:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.