Home / Basara
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. పీయూసీ విద్యార్థిని దీపిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటికోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.