Home / ap assembly
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు.
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
ఎన్టీఆర్ వర్శిటీ పేరును ఇకపై వైఎస్ఆర్ వర్శిటీగా మారుస్తూ ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. మంత్రి విడదల రజనీ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.
ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్ ట్యాపింగ్ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది.
మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలని, వారికి రాజకీయాల్లో 50శాతం కట్టబెట్టేలా చట్టాలు తేవాలనుకొనే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా మాటలు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి
ఏపీ అంసెబ్లీ సమావేశాలు నాలుగోరోజు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా నేడు ఏడు బిల్లులను ఏపీ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, నాడు-నేడు పై సభలో చర్చ జరుగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా నేడు రానుంది.