Last Updated:

Ramsetu Review : రామసేతు సినిమా రివ్యూ

Ramsetu Review : రామసేతు సినిమా రివ్యూ

Cast & Crew

  • అక్షయ్ కుమార్ (Hero)
  • జాక్వెలిన్ (Heroine)
  • సత్యదేవ్ (Cast)
  • అభిషేక్ శర్మ (Director)
  • అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా (Producer)
  • దానియెల్ (Music)
  • అసీం మిశ్రా (Cinematography)
2.5

Ramsetu Review : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ” రామసేతు “.ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్, విజువల్స్ పరంగా ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహించగా, ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చింది.మరి దీపావళి సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రామ్ సేతు’ ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఇక కథ విషయానికి వస్తే
ఈ సినిమా కథ 7వ శతాబ్దంలో శ్రీరాముడు, వానరసైన్యంతో కలిసి నిర్మించిన ‘రామ్ సేతు’ వంతెన చుట్టూ ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంటుంది.రావణుడు అపహరించిన సీతాదేవిని రక్షించాలని, లంకకు వెళ్లేందుకు శ్రీరాముడు తన బృందంతో కలిసి సముద్రంలో నిర్మించిన ‘రామసేతు’ బ్రిడ్జి నిజమేనా ? నిజంగా రామసేతు మూలాలు ఉన్నాయా? ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయి ? అని పరిశోధించే పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్యన్ చేసిన ప్రయాణమే ఈ సినిమా.ఈ సినిమాలో నాస్తికుడైన ఆర్కియాలజిస్ట్ ఆర్యన్.. రామసేతు ఉనికిని కనుగొనడంలో విజయం సాధిస్తాడా లేదా? అన్నది ఈ సినిమా.

ఫస్ట్ హాఫ్ కథ అంతా అలా సాగుతుంటుంది. రామాయణం.. శ్రీరాముడు.. రామ్ సేతు గురించి ఇంట్రడక్షన్స్ చూడటానికి బాగున్నాయి. ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఆర్యన్ పాత్రలో అక్షయ్ కుమార్ ఎంట్రీ సినిమాలో మామూలుగా లేదు. హీరోతో పాటు హీరోయిన్ జాక్వెలిన్ రోల్, తెలుగు యాక్టర్ సత్యదేవ్ పాత్రలు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి.ఐతే మెయిన్ కథలోకి వెళ్లడానికే కొంచం సమయాన్ని తీసుకున్నారని అనిపిస్తుంది.

సెకండాఫ్ లో రామసేతు మూలాలను ప్రూవ్ చేయడానికి డాక్టర్ ఆర్యన్ జర్నీ చాలా ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, అడ్వెంచరస్ సీన్స్ అన్ని బాగున్నప్పటికీ..ఇండియన్ హీరోలను హైలైట్ చేసినట్లుగా దీనిలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది….ఇక క్లైమాక్స్ విషయానికొస్తే మొత్తం అడ్వెంచర్స్ తో నింపేశారు.దర్శకుడు అభిషేక్ శర్మ రామ్ సేతు సీన్లను బలంగా రాసుకున్నట్టు కనిపించింది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే సంగీతం మిస్ అయ్యిందని ఫీలింగ్ కలుగుతుంది.ఇక సినిమాలో డాక్టర్ ఆర్యన్ గా అక్షయ్ కుమార్ యాక్షన్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :
స్టోరీ లైన్
అక్షయ్ కుమార్ నటన
సినిమాటోగ్రఫీ
విజువల్స్

మైనస్ పాయింట్స్ :
యాక్షన్ సీక్వెన్స్ డామినేషన్
పాటలు

సినిమా గురించి  ఒక్క మాటలో  చెప్పాలంటే

రామసేతు సినిమా  ఒక గుడ్ యాక్షన్  అడ్వెంచర్ 

ఇవి కూడా చదవండి: