Upasana Konidela: మెగావారి ఇంట అట్టహాసంగా ఉపాసన సీమంతం వేడుకలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత మెగావారి కోడలు పెద్ద గుడ్ న్యూస్ చెప్పడంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉపానస సీమంతం వేడుకలను ఘనంగా జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా ఉపాసన నెట్టింట షేర్ చేశారు.









