Sonal Chauhan: బీచ్ ఒడ్డున బాలయ్య భామ.. అందాల విందు.. అదరగొట్టేసిందంతే Roja Pantham 3 months ago అందాల భామ సోనాల్ చౌహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజవంశానికి చెందిన సోనాల్.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీవైపు అడుగులువేసింది. రెయిన్ బో అనే సినిమాతో సోనాల్ తెలుగుతెరకుపరిచయమైంది. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. లెజెండ్ తరువాత పండగ చేస్కో, సైజ్ జీరో, రూలర్.. ఆదిపురుష్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో కూడా సోనాల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ మాల్దీవ్స్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. బీచ్ ఒడ్డున బికినీలో అమ్మడు అందాల ఆరబోత చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.