Prabhas: ఎంట్రీ అదుర్స్ కదూ.. హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కిర్రాక్ లుక్స్
Prabhas: ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డిగోలో నిర్వహించే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రాజెక్ట్-K మూవీ టీం గతంలోనే ప్రకటించారు. కాగా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమైయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్, రానా, లోకనాయకుడు కమల్ హాసన్ సహా మూవీ టీం పలువురు పాల్గొన్నారు. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే లుక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు. ప్రభాస్ లుక్స్ చూస్తూ అభిమానులు ఫిదా అయిపోయారనుకోండి.









