నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా.. ఘట్టమనేని ఇంటికోడలిగా ఆమెకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు.
నటిగా ఉన్నప్పుడే మహేష్ ను వివాహమాడిన నమ్రత ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి భర్తకు సపోర్ట్ గా నిలబడింది.
మహేష్ కు తోడుగా, పిల్లలకు తల్లిగా ఉంటూనే బిజినెస్ విమెన్ గా ఎదిగింది.
ఒకపక్క నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటూనే.. ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను రన్ చేస్తూ బిజీగా మారింది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో నమ్రత ఫోటోలు చాలా రేర్ గా కనిపించేవి. కానీ, కొంతకాలంగా నమ్రత నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
తాజాగా నమ్రత ఒక పెళ్లికి హాజరయ్యింది. ఆ పెళ్ళిలో ఆమె సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.
కంచిపట్టు చీర.. ఒంటినిండా నగలతో ఆమె పెళ్లి కూతురులా కనిపించింది. ముఖ్యంగా మెడలో తాళిని ధరించి మారినంత అందంగా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. మహేష్ భార్య అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.