Trisha Krishnan: అందమే అతివై వస్తే నీవులే.. ఊపిరే గతులే తప్పి ఆడేలే
Roja Pantham
trisha krishnan
అందాల భామ త్రిష కృష్ణన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందం, అభినయం కలబోసిన రూపం త్రిష. వర్షం సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైంది.
మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని స్టార్ హీరోలందరి సరసన నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది త్రిష.
సినిమాల్లోనే కాదు వివాదాల్లో కూడా త్రిష ముందే ఉంటుంది. కొన్నాళ్లపాటు తెలుగుకు దూరమైన ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో హాట్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ప్రస్తుతం తెలుగులో త్రిష.. చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది.
తెలుగులోనే కాకుండా తమిళ్ లో త్రిష వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
తాజాగా త్రిష నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రేపు రిలీజ్ కు రెడీ అవుతోంది. అజిత్ నటించిన ఈ చిత్రంలో త్రిష రమ్య పాత్రలో నటిస్తోంది.
రేపు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రమ్య పాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ త్రిష అభిమానులను అలరించింది.
చీరకట్టులో త్రిష మరింత అందంగా మెరిసింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు అందమే అతివై వస్తే నీవులే అంటూ పాటలు పాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.