Bakrid 2023: బక్రీద్ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
Bakrid 2023: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలను చాలా భక్తిశ్రద్ధలతో ముస్లింలు నిర్వహించారు. త్యాగ నిరతికి, భక్తిభవానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12వ నెల అయిన జుల్‌హిజ్జా నెలలో పదో రోజున పండుగ కాగా, తొమ్మిదో రోజునే ఆరాఫా దినంగా జరుపుకుంటారు.






