Anchor Rashmi Gautam: ఎన్నో అనుకున్నా.. దేవుడు ఇలా చేశాడు – వెకేషన్లో యాంకర్ రష్మీ, ఫోటోలు చూశారా

Anchor Rashmi Latest Photos: యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

బుల్లితెర యాంకర్‌గా, వెండితెరపై నటిగా ఆమె కెరీర్లో సక్సెస్ ఫుల్‌గా ముందకు వెళుతుంది

జబర్దస్త్ కామెడీ షోతో ఒక్కసారిగా రష్మీకి మంచి క్రేజ్, విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది

ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ ఆమెను మరింత ఫేమస్ చేసింది, ఈ జోడి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే

ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్లో ఒకరిగా కొనసాగుతున్న రష్మీ ఇటీవల ఓ చేదు వార్తను పంచుకుంది

ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్టు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది

తీవ్రమైన భుజం నొప్పి, తీవ్ర రక్తస్రావంతో మూడు నెలలుగా బాధపడుతున్నట్టు చెప్పింది

గతవారం భుజం నొప్పికి శస్త్ర చికిత్స తీసుకున్న ఆమె వారం తిరక్కుండానే వెకేషన్‌కి వెళ్లింది

ప్రస్తుతం బాలిలో ఆమె సందడి చేస్తోంది, అక్కడ తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో ఫుల్ చిల్ అవుతుంది

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఎన్నో అనుకున్నా.. కానీ దేవుడు ఇలా చేశాడు అంటూ ఈ పోస్ట్‌కి రాసుకొచ్చింది