Alia Bhatt Photos: ఆలియా భట్ స్టన్నింగ్ లుక్ – 9 గజాల మహారాష్ట్ర నౌవారి చీరలో ఆకట్టుకున్న భామ Sneha Latha 1 month ago Alia Bhat Stunning Look At WAVES: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సంప్రదాయ వస్త్రధారణతో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకునే ఆమె తాజాగా తన చీరకట్టుతో కట్టిపడేసింది ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో వేడుకలో మహారాష్ట్ర సంప్రదాయ పద్దతిలో ఆకట్టుకుంటుంది మహరాష్ట్ర సంప్రదాయ నౌవారి చీరకట్టులో ఆలియా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది మే 1వ తేదీన ముంబైలోని ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన అలియా భట్, మహారాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టే తొమ్మిది గజాల నౌవారీ చీరను ఎంచుకున్నారు పీచ్, నారింజ రంగుల కలయికతో, గులాబీ రంగు అంచు, అందమైన పూల డిజైన్‌తో ఉన్న ఈ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది