Last Updated:

Electoral Bonds: ఎన్నికల బాండ్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.

దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Electoral  Bonds: ఎన్నికల బాండ్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.

Electoral Bonds: దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను 2018 జనవరి 2న కేంద్రం నోటిఫై చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

బాండ్ల ద్వారా క్విడ్ ప్రోకో..( Electoral Bonds)

బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని  ధర్మాసనం ఆందోళన  వ్యక్తం చేసింది.అయితే కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.ఈ మేరకు ఆయా విరాళాలను ఈసీ పార్టీలకు సమానంగా పంచుతుందని పేర్కొంది.ఇదే సమయంలో ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వివరాలు అందరికీ అందుబాటులో లేకపోవడంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది.వీటిని జారీ చేసే అధీకృత బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్, దర్యాప్తు సంస్థలు మాత్రమే విరాళాల వివరాలు పొందే వీలుందని కోర్టు వెల్లడించింది.రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్ట బద్ధత కల్పిస్తుందని స్పష్టం చేసింది.ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.

ప్రస్తుత బాండ్ల వ్యవ‌స్థలో ఉన్న లోపాల్ని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కోర్టు అభిప్రాయపడింది. అయితే పార్లమెంట్‌ చ‌ట్టం ద్వారానే ఆ మార్పును తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని, కోర్టు ఆ కోణంలో జోక్యం చేసుకోలేద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల కోసం కొత్త వ్యవస్థను డిజైన్ చేయాల‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. మూడు రోజులపాటు ఈ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.