Published On:

Who is Mehul Choksi..?: డైమండ్ కింగ్‌ టూ స్కామ్ కింగ్‌గా మారిన మెహుల్ చోక్సీ.. ఎవరు ఈ మెహుల్ చోక్సీ..?

Who is Mehul Choksi..?: డైమండ్ కింగ్‌ టూ స్కామ్ కింగ్‌గా మారిన మెహుల్ చోక్సీ.. ఎవరు ఈ మెహుల్ చోక్సీ..?

Who is Mehul Choksi..? Why Mehul Choksi arrested in Belgium:  దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు సంపాదించుకున్న మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డైమండ్ కింగ్‌గా ఉన్న ఆయన స్కామ్ కింగ్‌గా అవతారమెత్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెహుల్ చోక్సీ సుమారు రూ.14వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. తన మేనల్లుడు నీరవ్ మోడీతో జతకట్టి ఇండియన్ బ్యాంకుల నుంచి తప్పుడు రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయాడు. ఇలా ఆయన పాలన్‌పూర్ నుంచి బెల్జియం బాట పట్టాడు.

 

గుజరాత్‌లోని పాలన్‌పూర్ గ్రామంలో 1956 మే 5న జన్మించిన మెహుల్ చోక్సీ.. 1975లో జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1985లో వారసత్వంగా గీతాంజలి జెమ్స్ వ్యాపారాన్ని చేపట్టాడు. ఈ కంపెనీలో దాదాపు 70 బ్రాండ్లను అభివృద్ధి చేశాడు. ఇందులో ప్రధానంగా నక్షత్ర, డి డ్యూమాస్, గిల్లీ, అస్మి, వివాహ్ గోల్డ్ బ్రాండ్లను పరిచయం చేశాడు.

 

ఆ తర్వాత భారతదేశంలోనే కాదు.. తన వ్యాపారం ప్రపంచమంత వ్యాపించింది. ఈ సమయంలోనే బీజింగ్‌తో సహా ఇతర నగరాల్లో 20కిపైగా తన స్టోర్లను ఓపెన్ చేశాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆయనకు దేశీయ మార్కెట్‌లో 50 శాతం వాటా ఉంది. దీంతో గీతాంజలి జెమ్స్ వార్షిక టర్నోవర్ రూ.13వేల కోట్లకు పెరిగింది. ఇంత వ్యాపారం ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న అత్యాశ అతడి కెరీర్‌ను నాశనం చేసింది.

 

అయితే, వ్యాపారంలో బాగా రాణించడంతో మెహుల్ డైమండ్ కింగ్‌గా ఫేమస్ అయ్యాడు. ఇంటర్నేషనల్ డైమండ్ కింగ్‌గా గుర్తింపు పొందిన ఆయన అమెరికా, మధ్యఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. దేశంలో సుమారు 4వేలకు పైగా గీతాంజలి స్టోర్లు ఓపెన్ చేయగా.. వీటిని పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బాలీవుడ్ హీరోయిన్లు ప్రమోట్ చేశారు.

 

వజ్రాలతో డబ్బులు సంపాదించడం ప్రారంభించిన ఆయన.. ఆస్తి సుమారు రూ.20వేల కోట్లుగా మారింది. ఆయన మేనమామ నీరవ్ మోడీ పలు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ సమయంలో బ్యాంకు అధికారులతో కలిసి తప్పుడు పత్రాలు చూపించి మోసాలకు పాల్పడ్డారు. కొంతమంది సహాయంతో ఎఫ్ఎల్‌సీ కూడా ప్రమోట్ చేశారు. ఇలా ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొంతమంది అధికారులతో కుమ్మకై మోసపూరితమైన లెటర్స్ ఆఫ అండర్టేకింగ్ పొందారు.

 

ఈ భారీ స్కామ్ బయటపడగానే మెహుల్ చోక్సీతో పాటు నీరవ్ మోడీ ఇద్దరూ తప్పించుకున్నారు. ఇలా బెల్జియంలోని యాంట్వెర్స్‌కు వెళ్లారు. అక్కడే తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ఉంటున్నాడు. కాగా, ప్రీతి చోక్సీ అక్కడే ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందడంతో పాటు బెల్జియం పౌరసత్వంతో బెల్జియం సిటిజన్‌షిప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మెహుల్ చోక్సీ.. డైమండ్ కింగ్‌ టూ స్కామ్ కింగ్‌గా మారారు.

 

అంతకుముందు, 2018లో అరెస్ట్ కాగా, ఇండియాకు తీసుకురావడంతో సీబీఐకి నిరాశ ఎదురైంది. తాజాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన అవకతవకలను బెల్జియం దేశానికి చూపించాయి. సీబీఐ, ఈడీ సంయుక్తంగా చేపట్టిన ఈ కేసులో ఎట్టకేలకు ఆయనను బెల్జియంలో అరెస్ట్ చేశారు.