Last Updated:

Pune : పూణె లో మానవ ఎముకలతో తయారు చేసిన పొడిని తిన్న మహిళ.. ఎందుకో తెలుసా?

పూణెలో ఒక మహిళ తన అత్తమామలు మరియు భర్త బలవంతం చేయడంతో మానవ ఎముకలతో తయారు చేసిన పొడిని తినవలసి వచ్చింది.

Pune : పూణె లో  మానవ ఎముకలతో తయారు చేసిన పొడిని తిన్న మహిళ..  ఎందుకో తెలుసా?

Pune : పూణెలో ఒక మహిళ తన అత్తమామలు మరియు భర్త బలవంతం చేయడంతో మానవ ఎముకలతో తయారు చేసిన పొడిని తినవలసి వచ్చింది.

మహిళ గర్బం దాల్చడానికి ఇలా చేయాలంటూ ఒక తాంత్రికుడు చేసిన సూచన మేరకు ఆమెతో ఇలా చేయించారు.

మహిళ ఫిర్యాదు మేరకు, పూణె సిటీ పోలీసుల ఆధ్వర్యంలోని సిన్హ్‌గడ్ పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు భర్త, అత్తమామలు మరియు తాంత్రికుడితో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.

మూఢనమ్మకాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3తో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని 498 ఎ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

బాధితురాలి కుటుంబం బాగా చదువుకున్నప్పటికీ, ఇప్పటికీ అలాంటి పద్ధతులను పాటిస్తోంది.

కట్నం కోసం కూడా వేధించారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మొదటి కేసులో, బాధితురాలు తన పెళ్లి సమయంలో (2019లో) తన అత్తమామలు కట్నం డిమాండ్ చేశారని అందులో నగదు, బంగారం మరియు వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొంది.

రెండవ కేసులో, బాధితురాలి అత్తమామలు ఆమెను ఇంట్లో కొన్ని మూఢనమ్మకాలలో పాల్గొనమని బలవంతం చేశారు.

బలవంతంగా శ్మశానవాటికకు తీసుకెళ్లి కొన్ని చనిపోయిన మానవుడి ఎముకలను తినమని అడిగారు.

అఘోరా పూజలు చేయించారు..

మరొక రకమైన ఆచారంలో అత్తమామలు బాధితురాలిని మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ ఆమె జలపాతం కింద “అఘోరీ” అభ్యాసంలో పాల్గొనవలసి వచ్చింది.

ఈ అభ్యాసాల సమయంలో, వారు వీడియో కాల్స్ ద్వారా ఫోన్‌లో తాంత్రిక్ బాబా నుండి సూచనలను కూడా తీసుకున్నారని డీసీపీ శర్మ చెప్పారు.

ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తూ మేము ఏడుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.

చిన్నారిని చంపేసిన మేనత్త..

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో కొద్దిరోజులకిందట 3 ఏళ్ల బాలుడిని అతని మేనత్త చంపిన ఘటన వెలుగుచూసింది.

మూడు రోజులుగా బాలుడు కనిపించకుండా పోయాడు.

ఆదంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పూర్ గ్రామంలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో అతని మృతదేహం ముక్కలు లభించాయి.

తమ బిడ్డను మాయమాటలతో అత్త హత్య చేసిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.

పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

తన ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడంతో నిందితురాలు చేతబడి ప్రాక్టీసు చేసినట్లు తెలుస్తోంది.

చేతబడి అనుమానంతో అక్కా తమ్ముళ్లపై దాడి ..

తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో భార్యభర్తలు రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో, చేతబడి చేశారన్న అనుమానంతో అర్ధరాత్రి నిద్రిస్తుండగా అక్కాతమ్ముడిపై దాడి చేసారు.

ఎటపాక మండలం రామగోపాలపురానికి చెందిన పెనుబల్లి రాముడు, వెంకమ్మ భార్యభర్తలు.

వెంకమ్మ కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స తీసుకుంటోంది.అయితే ఆమె పరిస్దితిలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాముడు కొద్ది రోజుల కిందట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంకమ్మ కూడా చికిత్స పొందుతూ మృతిచెందింది.

దీనితో చేతబడి కారణంగానే ఇలా జరిగి ఉంటుందని ఈ దంపతుల బంధువులు రాజేశ్, గంగరాజు అనుమానం వ్యక్తం చేశారు.

అదే గ్రామానికి చెందిన సొంది గోపమ్మ, ఆమె తమ్ముడు కొర్సా రామ్మూర్తి చేతబడి చేశారని భావించిన రాజేశ్, గంగరాజు ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగి కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో గోపమ్మ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన రామ్మూర్తిని ఆస్పత్రికి తరలించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/