Published On:

Bees Attack : మాక్‌ డ్రిల్‌ సమయంలో తేనెటీగల దాడి.. పరుగులు తీసిన అధికారులు

Bees Attack : మాక్‌ డ్రిల్‌ సమయంలో తేనెటీగల దాడి.. పరుగులు తీసిన అధికారులు

‘Operation Shield’ in border Districts : రాజస్థాన్‌లోని పాక్ సరిహద్దు జిల్లాలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు పరుగులు తీశారు. ఈ ఘటన రియల్‌ మాక్‌ డ్రిల్‌ను తలపించింది. ఝలావర్‌లోని కాలిసింధ్ డ్యామ్‌ వద్ద మాక్ డ్రిల్ సందర్భంగా డ్రోన్ దాడి జరుగుతుందన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో అక్కడ ఉన్న కలెక్టర్, ఎస్పీతోపాటు చాలామంది అధికారులు, ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

 

మాక్‌ డ్రిల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 8 నుంచి వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆయా నగరాల్లో 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. బ్లాక్‌అవుట్‌ సమయంలో ప్రజలు తమ ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో లైట్లు ఆర్పివేశారు. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హెడ్‌లైట్లను ఆపివేశారు. జైపూర్‌లోని ఖతిపురా రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల మైదానంలో డ్రోన్‌, క్షిపణి దాడులతో రియల్ టైమ్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: