Home / తెలంగాణ
TBJP: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఇవాళ ఓ లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజాసింగ్.. ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. రాజాసింగ్ ఇచ్చిన లేఖను కిషన్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు పంపారు. దీంతో ఆయన రాజీనామాను పార్టీ పెద్దలు ఆమోదించారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సీరియస్ […]
AP Deputy CM Pawan Kalyan: హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అధికార భాషా స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హిందీని జాతీయ భాషగా నేను స్వాగతిస్తున్నానని ప్రకటించారు. ప్రతీ భాష జీవ భాష అని, సరిహద్దులు దాటితే మన భాష హిందీ అని పేర్కొన్నారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనని అన్నారు. ఇంగ్లిష్, ఉర్దూ, పర్షియన్ భాషలను అంగీకరించి హిందీని […]
Engineering Colleges: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫీజులు పెంచాలన్న కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. ఆరు వారాల లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు చెప్పింది. కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. […]
Ujjaini Mahankali Temple: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, […]
Weather Update: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయని హెచ్చిరించింది. మరోవైపు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నీటీ ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉన్న జలాశయాలు నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని పెనుగంగా […]
Local Body Elections: SC వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అదే తరహాలో మరో ఘనతను సాధించబోతుంది. వెనుబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ ఎట్టకేలాకు అమల్లోకి రానుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు దిశగా రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. అయితే బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం 2018 […]
Damodara Raja Narasimha: తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలో నివసిస్తూ, అక్కడే ఓ హోటల్లో పని చేసుకుంటున్నారు. చంద్రకాంత్ దంపతుల 8 ఏండ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో, ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చూపించారు. పాపకు గుండె జబ్బు ఉన్నదని, ఆపరేషన్ చేయకపోతే […]
HCA President Jaganmohan Rao Remanded: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు.. […]
Breaking News : KTR: హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని.. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ […]
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. గత మంత్రివర్గ సమావేశంలో మూడు నెలలకోసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు జరిగిన 18 మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న 327 నిర్ణయాలు, వాటి అమలుపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ను ఈ సమావేశంలో సమర్పించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మేడిగడ్డ […]