Published On:

CM Revanth Reddy: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం.. వీడియో వైరల్

CM Revanth Reddy: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం.. వీడియో వైరల్

CM Revanth Reddy Having Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం ఆ కుటుంబసభ్యుల కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మొదటి నుంచి రాష్ట్రంలోని లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు వారి నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ లబ్దిదారుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.

 

అంతకుముందు, భద్రాచలంలోని కోదండరామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

 

 

ఇవి కూడా చదవండి: