Last Updated:

CM KCR: పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా ? కేసీఆర్

CM KCR kongara kalaan Rangareddy TRSమత ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని సీఎం కేసీఆర్ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగ‌ర‌క‌లాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా స‌మీకృత కలెక్టరేట్‌

CM KCR: పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా ? కేసీఆర్

Ranagareddy: మత ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని సీఎం కేసీఆర్ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగ‌ర‌క‌లాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా స‌మీకృత కలెక్టరేట్‌ స‌ముదాయాన్ని గురువారం ఆయ‌న‌ ప్రారంభించారు. అనంతరం కొంగర్‌ కలాన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఈ సందర్బంగా కేంద్రం, బీజేపీల తీరు పై విమర్శలు గుప్పించారు. మనకు శాంతి యుత తెలంగాణ కావాలని ఆయన ఆకాక్షించారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోని భారతదేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండాలని కేసీఆర్​ అన్నారు. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామని, తెలంగాణను కాపాడే బాధ్యత తనదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. పంటల తెలంగాణ కావాలా, మంటల తెలంగాణ కావాలా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ఇన్నేళ్లలో ఒక్క మంచిపనైనా చేసిందా, మనం మౌనంగా భరిద్దామా అని కేసీఆర్ నిలదీశారు.

హైదరాబాద్‌లో 24 గంటలు కరెంట్ వుంటే ఢిల్లీలో వుండదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రధాని మనకు కావాలా అని సీఎం ప్రశ్నించారు. స్టాలిన్, మమతా బెనర్జీ ప్రభుత్వాలను కూలుస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేని కొంటామని మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. దీనిని ఇలాగే వదిలేస్తే తాను చెప్పినట్లుగా మత పిచ్చి మంటలే వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వనని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి: