Last Updated:

AP Assembly: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

అందరూ ఊహించిన్నట్లుగానే ఏపి అసెంబ్లీ నుండి తెలుగుదేశం సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.

AP Assembly: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

Amaravati: టీడీపీ నేతలు సభను ఉద్ధేశపూర్వకంగా జరగనీయడం లేదంటూ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పై చర్చ జరగడాన్ని తెదేపా సభ్యులు అడ్డుకోవడం సబబు కాదని బుగ్గన తెలిపారు. అనంతరం టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి లను సభ నుండి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు సూచించారు. దీంతో ఏకీభవించిన తమ్మినేని ఒక్కరోజు పాటు తెదేపా ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చర్చల సమయంలో తేదేపా సభ్యులను సస్పెండ్ చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.

 

ఇవి కూడా చదవండి: