Last Updated:

Swaroopanandendra Saraswati: రెవిన్యూ శాఖాధికారులు దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు.. స్వరూపానందేంద్ర స్వామి సంచలన ఆరోపణలు

రెవిన్యూ అధికారులపై స్వామి స్వరూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ మాటలన్నారు.

Swaroopanandendra Saraswati: రెవిన్యూ శాఖాధికారులు దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు.. స్వరూపానందేంద్ర స్వామి సంచలన ఆరోపణలు

Visakhapatnam: రెవిన్యూ అధికారులపై స్వామి స్వరూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ మాటలన్నారు.

దేవాలయంలో భూ వివాదాలు, భూ కబ్జాల నేపధ్యంలో రెవిన్యూ ఉద్యోగుల సేవలు అవసరమేనన్నారు. అయితే దేవాదాయ శాఖను నిర్వీర్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. 12ఏళ్లగా పదోన్నతలు లేకపోవడం శోచనీయమన్నారు. కోర్టు వ్యాజ్యాలను పక్కన పెట్టి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రెవిన్యూ శాఖ ఉద్యోగులను ఆలయాల్లో ఈవోలుగా నియమించడం ఏంటంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇదంతా ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలన్నారు. ఉద్యోగుల పదోన్నతల కోసం ప్రభుత్వంతో మాట్లాడుతాను అని స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు.

ఏపీలో వ్యవస్ధలను నాశనం చేస్తున్నారంటూ ప్రభత్వం పై ప్రతిపక్షాలు కోడై కూస్తున్న సమయంలో స్వామి స్వరూపానందేంద్ర ఏకంగా రెవిన్యూ వ్యవస్ధను తప్పుబట్టారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి, స్వామికి ఉన్న సాన్నిహిత్యం నేపధ్యంలో స్వరూపానందేంద్ర మాట్లాడిన మాటల పై రెవిన్యూ అధికారులు మాట్లాడలేకపోతున్నారు.

ఇది కూడా చదవండి: వెంకన్న దర్శనం కోసం కి.మీ మేర బారులు తీరిన భక్తులు…

ఇవి కూడా చదవండి: