Sri Ram Navami: నేడు శ్రీరామనవమి..రాముడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇలా చేయండి?

Happy Sri Ram Navami 2025: శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముస్తాబయ్యాయి. రామాయణ గాథ మనదేశంలో పామరులకు కూడా తెలుసు. అయితే శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు.. ఆదర్శదైవం కూడా. ఆసేతు హిమాచలం మన దేశంలో రాయాలయాలు లేని ఊళ్లు ఉండవు. కాగా, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు అమోధ్య రామ మందిరం ముస్తాబైంది. శ్రీరామనవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు.
ఇదిలా ఉండగా, అయోధ్యలో నిర్మించిన బాల రాముడి ఆలయం గతేడాది జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ మేరకు ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా, శ్రీరామనవమి సందర్భంగా వేడుకలను ఊరువాడా అందరూ నిర్వహిస్తుంటారు. సీతారాముల కల్యాణాన్ని జరిపించేందుకు దేశవ్యాప్తంగా ఇళ్లల్లోనూ పూజిస్తుంటారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలని పురోహితులు చెబుతున్నారు.
శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన ఇళ్లల్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూజమందిరం సానుకూల శక్తికి మూలం. పూజ మందిరాన్ని శుభ్రం చేయడంతో పాటు విరిగిన విగ్రహాలు, పగిలిన ఫొటోలను తొలగించాల్సి ఉంటుంది. పూజకు అవసరమైన వస్తువులనే మాత్రమే తీసుకొని మిగతా వస్తువులను తీసివేయాలి.
వంటగది.. లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశం. కావున శ్రీరామనవమి రోజు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో పనికిరాని వస్తువులు ఉంచకూడదు. అలాగే పాత్రలను కడకకుండా పెట్టకూడదు. పాడైపోయిన పదార్థాలు, పచ్చళ్లు తొలగించాలి.
అలాగే, శ్రీరామనవమి రోజు ఇంట్లో ఉత్తర దిశ ఈశాన్యం మూల శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా ప్రధాన ద్వారం వద్ద శుభ్రంగా ఉండాలి.ద్వారం వద్ద ముగ్గుతో పాటు పసుపు కుంకుమలతో అలంకరించాలి. ప్రధాన ద్వారం కళకళలాడుతుండాలి. శ్రీరామనవమి రోజు ఈ ప్రదేశాలను శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు.