ABC Juice For Weight Loss: ఒకే ఒక నెలలో బరువు తగ్గాలా ? అయితే.. ఈ జ్యూస్ తాగండి

ABC Juice For Weight Loss: ఈ రోజుల్లో బరువు పెరగడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగానే నేడు ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేకపోతుంటారు. అలాంటి వారికి జిమ్ లేదా డైటింగ్ అవసరం లేని, బరువు తగ్గడానికి ఒక మార్గాన్ని చెప్పబోతున్నాము . ఈ పద్ధతిని ఇంట్లో ఒక నెల పాటు ప్రయత్నించండి చాలు. మీ బరువు ఈజీగా తగ్గుతుంది.
ఈ పద్ధతే.. ABC జ్యూస్ ఛాలెంజ్
ABC జ్యూస్ అంటే ఏమిటి ?
A అంటే ఆపిల్, B అంటే బీట్‌రూట్ , C అంటే క్యారెట్. అంటే.. ఆపిల్, బీట్‌రూట్ ,క్యారెట్ నుండి తయారైన రసాన్ని ABC జ్యూస్ అంటారు. విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ , అనేక ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఈ జ్యూస్ రుచికరంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది.
బరువు తగ్గడానికి రోజూ ABC జ్యూస్ తాగండి:
ఆపిల్, క్యారెట్ , బీట్‌రూట్‌లతో తయారు చేసిన ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు చాలా త్వరగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
అంతే కాకుండా ఎక్కువగా ఆకలిగా కూడా అనిపించదు. దీనిలో ఉండే పోషకాలు శక్తి , బలాన్ని అందిస్తాయి. దీంతో పాటు.. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రసం తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచేవి:
ABC జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది:
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య కూడా రాదు.
చర్మానికి మెరుపు:
ABC జ్యూస్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. అంతే కాకుండా ముఖంపై మచ్చలు కూడా తొలగిపోతాయి.
కళ్ళకు మేలు చేస్తుంది:
విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఈ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం:
ABC జ్యూస్ రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ABC జ్యూస్ ఎలా తయారు చేయాలి ?
ABC జ్యూస్:
ఈ రసం చాలా త్వరగా, సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం 1 ఆపిల్, 1 బీట్‌రూట్ ,1 క్యారెట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని జ్యూసర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీని తరువాత.. అవసరాన్ని బట్టి నీరు అందులో నీటిని మిక్స్ చేయండి. దీనిని ఫిల్టర్ చేసి ఒక గ్లాసులో పోసి, కొంచెం నిమ్మరసం కలపండి. మీరు ఈ జ్యూస్‌ను రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
కాబట్టి.. మీరు కూడా మీ బరువు పెరుగుతుందని ఆందోళన చెందుతూ, దాన్ని వదిలించుకుని కోరుకుంటే.. ప్రతిరోజూ ABCజ్యూస్ తాగడం ప్రారంభించండి.