Last Updated:

Uddhav Thackeray: కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతాం.. మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే

మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే వర్గానికి ఎన్నికల కమీషన్ పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. తనకు కేటాయించిన కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతామని ఉద్ధవ్ ప్రకటించారు.

Uddhav Thackeray: కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతాం.. మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే

Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరే వర్గానికి ఎన్నికల కమీషన్ పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. తనకు కేటాయించిన కాగడాతో అన్యాయాన్ని, మోసాన్ని తగలబెడుతామని ఉద్ధవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శివసేన పార్టీ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు కూడా పార్టీ గుర్తు పై ఈసీకే అధికారాలను కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ఉద్ధవ్ ధాకరే పార్టీ పేరును శివసేన-ఉద్ధవ్ బాలాసాహెబ్ ధాకరే అనే పేరు, కాగడా గుర్తును ఈసీ కేటాయించింది. అదే విధంగా ఏక్ నాధ్ షిండే వర్గానికి బాలాసాహెబ్ శివసేన అనే పేరు కేటాయించింది.

ఈ రెండు పేర్లను ఆయా పార్టీలో పేర్కొనడంతో ఈసీ వాటిని ఖరారు చేసింది. గతంలో శివసేన పార్టీకి విల్లు-బాణం గుర్తును కేటాయించివున్నారు. పార్టీలో చోటుచేసుకొన్న విభేధాలతో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకొనింది. పరోక్షంగా ఏక్‌నాథ్ షిండే, బీజేపీ పై ఉద్ధవ్ ధాకరే ఘాటు విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: ఇకపై జమ్మూకశ్మీర్ లో డిపార్టుమెంటు స్టోర్స్ లో బీరు అమ్మాకాలు.. మండిపడుతున్న భాజపా శ్రేణులు

ఇవి కూడా చదవండి: