Last Updated:

Kcr vs Tamilisai: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. రిపబ్లిక్ డే పై ఎఫెక్ట్

Kcr vs Tamilisai: రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మెున్నటి వరకు అధికార ప్రభుత్వం- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.

Kcr vs Tamilisai: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. రిపబ్లిక్ డే పై ఎఫెక్ట్

Kcr vs Tamilisai: రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మెున్నటి వరకు అధికార ప్రభుత్వం- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇపుడు తాజాగా.. రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దేశంలో బి‌జే‌పి వర్సెస్ బి‌ఆర్‌ఎస్ రాజకీయ యుద్ధం నడుస్తుంటే. రాష్ట్రంలో ఇపుడు కే‌సి‌ఆర్ వర్సెస్ గవర్నర్ పోరు నడుస్తుంది. ప్రోటోకాల్ పాటించడం లేదని.. గవర్నర్ తమిళిసై పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది.

ఈ సారి వేడుకలు లేనట్టేనా?

రాష్ట్రంలో జరగబోయే గణతంత్ర వేడుకలపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. దీంతో ఇప్పటి నుంచే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్ వేదికగా నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలు లేనట్టే కనిపిస్తుంది.

ఇటు ప్రగతి భవన్ అటు రాజ్ భవన్ వాతావరణం చూస్తే రిపబ్లిక్ డే పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

సాధారణంగా రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్ సమక్షంలో జరుగుతాయి.

గతంలో రిపబ్లిక్ డే వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేది.

ఈ వేడుకలో ముఖ్యమంత్రి, గవర్నర్ పాల్గొనేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు మధ్య ఏర్పడిన విభేదాలే ప్రధాన కారణం.

ప్రోటోకాల్ వివాదంతో ఒకే వేదికను పంచుకోని సీఎం కేసీఆర్.. గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు కలిసి నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది.

దీంతో రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

కొనసాగుతున్న మాటల యుద్ధం

ఇక ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జెండా ఎగరవేయనున్నారు.

బిఆర్ కే ఆర్ భవన్ లో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు.

కరోనా ప్రభావంతో గత మూడేళ్లుగా రిపబ్లిక్ డే వేడుకలను సాదాసీదాగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.

పరేడ్ గ్రౌండ్ లో కాకుండా పబ్లిక్ గార్డెన్ లో పరిమిత సంఖ్యలో వేడుకలు జరుపుతున్నారు.

పబ్లిక్ గార్డెన్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ కు బదులు సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించారు.

దీంతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి. ప్రోటోకాల్ వివాదంలో సీఎం ఎందుకు స్పందించడం లేదని గవర్నర్ ప్రశ్నించారు.

దీంతో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో కూడా నిర్వహించటం లేదని తెలుస్తోంది.

రిపబ్లిక్ డే నాడు రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమానికి గత ఏడాది కూడా అధికారులు మాత్రమే హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా డుమ్మా కొట్టారు.

అయితే ఈసారి కూడా రాజ్ భవన్ లో జరిగే వేడుకలకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

రాజ్ భవన్.. ప్రగతి భవన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తో కీలకమైన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా దాటవేస్తున్నారని బిఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

వీటికి తోడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో రిపబ్లిక్ డే వేడుకలు ఎవరికి వారే నిర్వహించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

దీనిపై స్పందించిన తమిళి సై ప్రభుత్వ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ప్రతీ రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతుంటే ఇక్కడ జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఘనంగా రిపబ్లిక్ డే జరుపుకోక పోవడం తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమే అని తెలిపారు.
రాజభవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం లేఖ రాయడం పై అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని , విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సర్క్యలర్ పంపింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై పిటిషన్ దాఖలు. దీనిపై లంచ్ మోషన్ దాఖలు చేసిన పిటిషనర్లు.

దీనిపై విచారణ చేయనున్న జస్టిస్ మాధవి ధర్మాసనం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/