Delhi High Court – Vivo: వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే బ్యాంకు ఖాతాలు నిర్వహించవచ్చు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును
Delhi: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
వివో ఇండియా మరియు దాని సంబంధిత సంస్థలకు చెందిన 48 ప్రాంగణాల పై దేశవ్యాప్తంగా దాడులు ప్రారంభించే ముందు ఈడీ ఇండియాకు చెందిన మొత్తం9 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని సంబంధిత బ్యాంకులను ఆదేశించింది. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బిసి, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు డిబిఎస్ బ్యాంక్ వివో ఇండియా ఖాతాలను గుర్గావ్, ముంబై, న్యూఢిల్లీ, నోయిడా మరియు బాద్‌షాపూర్‌లోని శాఖలలో నిర్వహిస్తున్నాయి.