Last Updated:

TTD: వృద్ధులు, దివ్యాంగ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తితిదే

సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

TTD: వృద్ధులు, దివ్యాంగ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తితిదే

Tirumala: సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి పేర్కొనింది.

రూ. 300 ప్రత్యేక టిక్కెట్ల కల్గిన భక్తులకు తిరుమలలో వసతి కోసం డిసెంబర్ కోటాను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తితితే పేర్కొనింది. దర్శనం కొరకు 65 సంవత్సరాలు పైబడిన వారు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఇందుకోసం గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. వారికి ఉచితంగా దర్శనం ఏర్పాటు చేస్తారు. నడిచేందుకు వీలులేని వృద్ధులకు సాయంగా జీవిత భాగస్వామికి తితిదే అనుమతి కల్గిస్తుంది. 80 ఏళ్లు దాటిన భక్తులకు వారితో పాటు సహాయకులకు కూడా దర్శన భాగ్యాన్ని తిరుమలలో కల్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Free Distribution: 673రోజుకు చేరుకొన్న అన్నదానం..బళా ఎమ్మెల్యేగా పేరును తెచ్చుకొన్న నిమ్మల రామా నాయుడు

ఇవి కూడా చదవండి: