Last Updated:

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ.. తన ముగ్గురు స్నేహితులవీ ఆత్మహత్యే..!

ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కాగా 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదే తరహాలో తన ముగ్గురు స్నేహితులు కూడా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నాట పలు అనుమానాలకు తావిస్తోంది.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్  డెత్ మిస్టరీ.. తన ముగ్గురు స్నేహితులవీ ఆత్మహత్యే..!

Sushant Singh Rajput: ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ యువ హీరో అతి చిన్న వయస్సులోనే సూసైడ్ చేసుకుని కాలం చెల్లించారు. 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యువ హీరో మరణం బాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణంపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దానితో ఈ కేసు చాలా రోజులు సాగింది. అయితే తాజాగా రెండు రోజుల క్రితం సుశాంత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి వైశాలి ఠక్కర్ కూడా సూసైడ్ చేసుకోవడంతో మరోసారి సుశాంత్ ఆత్మహత్య చర్చలోకి వచ్చింది.

వైశాలి మరణంపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ తో పాటు ఇప్పటికే ఆయన స్నేహితులు ముగ్గురు సూసైడ్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జూన్ 14, 2020న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది హత్యే అని ఆరోపణలు ఉన్నా పోలీసులు దీన్ని ఆత్మహత్య అని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సుశాంత్ మరణానానికి ఐదు రోజుల ముందు సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్ దిశా సలియాన్ కూడా ఆత్మహత్య చేసుకుంది దీనిని కూడా కుటుంబసభ్యులు హత్య అంటుంటే పోలీసులు మాత్రం ఆత్మహత్య అంటూ కేసు క్లోజ్ చేశారు.

2021 ఫిబ్రవరి 15న సుశాంత్ మరో స్నేహితుడు సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను కూడా ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లో సుశాంత్‌తో కలిసి నటించాడు. కుటుంబ సమస్యల వల్లే సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా తాజాగా వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది. తన సుసైడ్‌కు ఆమె ప్రియుడే కారణమంటూ ఓ నోట్ కూడా లభించిందని పోలీసులు అంటున్నారు. కానీ ఈ మరణం వెనక కూడా ఎవరో ఉన్నారు అని సన్నిహితులు అంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అతని స్నేహితులు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం, సన్నిహితులు వాటిని హత్య అని ఆరోపించడం, పోలీసులు మాత్రం అవి సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మరి పోలీసులు ఈ కేసులను ఓ కోణంలో విచారిస్తున్నారో అనేది తెలియదు.

ఇదీ చదవండి: అలా చేస్తే “ప్యాకేజీ స్టార్” మాటను వెనక్కి తీసుకుంటాం- పేర్నినాని సవాల్

ఇవి కూడా చదవండి: