Suicide Bomb Attack: ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్నే టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్లాల్ ఎవెన్యూలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటలో ఆరుగురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి.
Suicide Bomb Attack: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్నే టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్లాల్ ఎవెన్యూలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటలో ఆరుగురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి.
❗The number of victims of the explosion in #Istanbul has increased to six, said #Turkish President Recep Tayyip #Erdogan. According to him, 53 people were injured. pic.twitter.com/75BLaG1RUf
— NonMua (@NonMyaan) November 13, 2022
ప్రజల రణగొణ ధ్వనులతో నిత్యం రద్దీగా ఉండే టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్ లాల్ ఎవెన్యూపై ఆత్మాహుతి బాంబర్ దాడి చేయ్యడంతో భారీ విధ్వంసం నెలకొంది. దానితో ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు పెట్టారు.ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మంది ప్రజలు దుర్మరణం చెందగా మరో 80 మందికిపైగా గాయపడ్డారు. కాగా ఈ విషాద ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ అలీయెర్లికాయ ట్వీట్ చేశారు. ఇస్తాంబుల్ లో ఈ మార్కెట్ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి వస్తువులు పేలుడుదాటికి గాల్లో ఎగిరి చిందరవందరగా పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూడడానికి ఎంతో భయానక వాతావారణాన్ని కలిగింది.
⚠️‼️🇹🇷💥Explosion occurred in the center of Istanbul, there are wounded, Turkish TV reports
The explosion occurred on the pedestrian tourist street Istiklal in Istanbul pic.twitter.com/7tlBdBdQTU
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) November 13, 2022
ఈ ఘటనను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. ఇస్తాంబుల్లో ఘటన నీచమైన దాడి అని దీనిని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దాడికి కారకులైన వారి కోసం దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓ మహిళ తనను తాను బాంబుతో ఆత్మాహుతిదాడికి పాల్పడినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్నామని స్థానిక అధికారులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. కుక్కల కళ్యాణం