Raksha Bandhan: రక్షాబంధన్.. చిన్ననాటి ఫోటోలు షేర్ చేసిన రాహుల్ గాంధీ
రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
New Delhi: రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చిన్న నాటి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను, నా సోదరి ప్రియాంక బాల్యం నుంచి ఒకరికొకరం తోడుగా నిలిచాం. కష్టసుఖాల్లోనూ పరస్పరం అండగా ఉంటూ ధైర్యం చెప్పుకొన్నాం. సోదరి, ఈ బంధం శాశ్వతంగా ఉంటుంది అంటూ రాహుల్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక, రాహుల్ చిన్న నాటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.