Radhika Apte: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్ – పాప ఫోటో షేర్ చేసి రాధికా ఆప్టే
Radhika Apte Blessed With Baby Girl: హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రక్త చరిత్ర, నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఈ మధ్య తెలుగు తెరపై కనుమరుగైంది. బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్ చేసిది. బోల్స్ సీన్స్‌లోనూ నటించి ప్రశంసుల, విమర్శలు అందుకుంది.
అయితే తాజాగా ఈ ‘లెజెండ్’ బ్యూటీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారం రోజులు క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాపకి పాలు పడుతున్న ఫోటో షేర్ చేస్తూ.. డెలివరి తర్వాత ఫస్ట్ వర్క్ మీట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్, సినీ సెలబ్రిటీలు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. తమ అభిమాన నటి తల్లయిన విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే పట్టింది మగబిడ్డ, ఆడబిడ్డ అనేది పోస్ట్‌లో స్పష్టం చేయలేదు. కానీ ఇట్స్‌గర్ల్, బేబీగర్ల్ వంటి హ్యాష్ ట్యాగ్స్ జత చేసింది. దీంతో రాధిక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని అంతా కన్‌ఫాం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా రాధికకు సినిమాల్లోకి రాకముందే పెళ్లయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త పేరు బెనెడిక్ట్ టైలర్. అతను బ్రిటిష్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్. వీరి వివాహం 2012లో జరిగిందట. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి రావడం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన లెజెండ్, హిందీ సినిమాలు ‘ఫోరెన్సిక్’, ‘విక్రమ్ వేద’, ‘మోనికా ఓ మై డార్లింగ్’ 2013లో విడుదల అయ్యాయి. ఇక పెళ్లయిన 12 ఏళ్లకు ఆమె తల్లవ్వడం విశేషం. తెలుగులో లెజెండ్ సినిమాతో మంచి గుర్తింపు పొందిన రాధిక తమిళ్, హిందీ, మరాఠి, బెంగాలి, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించింది. బోల్డ్ పాత్రల్లో సైతం ధైర్యంగా నటించింది. దీనివల్ల ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక ఆ తర్వాత నటి, హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అన్ని భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటి అనిపించుకుంది.